ప్రపంచంలో మొదట కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన సమోవా ద్వీపం
ప్రపంచంలో అందరికంటే ముందు కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టింది ఫసిఫిక్ ద్వీపంలోని సమెవా ద్వీపం. ఏటా ప్రపంచంలో అందరికంటే ముందు కొత్త సంవత్సరాన్ని స్వాగతించేది ఈ ద్వీపమే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ కొత్త సంవత్సరం వచ్చేసింది. తర్వాత కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. అటు తర్వాత న్యూజిలాండ్ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. ప్రపంచ కాలమానం ఇంగ్లండ్ లోని గ్రీన్ విచ్ రేఖాంశం నుండి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఇది సున్నా డిగ్రీలుగా ఉంటుంది. రేఖాంశాల ఆధారంగా సమయాన్ని నిర్ణయించారు. మన దేశం 82.ఈ ప్రకారం ఐఎస్ టి సమయం ఉంటుంది. మనకంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత మూడున్నర గంటల ముందు జపాన్ లో .. ఆ వెంటనే ఉత్తర, దక్షిణ కొరియాలు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాయి. మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లు మనకంటే అరగంట ముందే అడుగుపెడతాయి.
