ప్రమాదానికి కారణాలేంటి?

ప్రమాదానికి కారణాలేంటి?

హైదరాబాద్‌‌/నాగర్ క‌ర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంట్‌ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అడిషనల్‌ డీజీ గోవింద్ సింగ్‌, డీఐజీ సుమతితో కూడిన టీమ్‌ శనివారం ప్రమాద స్థలిలో ఎవిడెన్స్ సేకరించింది. టీమ్ లోని అడిషనల్‌ ఎస్పీ, నలుగురు డీఎస్పీలతో పాటు ఫోరెన్సిక్‌, క్లూస్‌ టీమ్, ఎలక్టక్‌ ఎక్స్‌‌పర్ట్స్ ‌ప్ర‌మాద కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో శని, ఆదివారం పవర్ జనరేషన్, సప్లైని వీడియో తీసినట్లు తెలిసింది. మెటీరియల్ ఎవిడెన్స్‌‌ కలెక్ట్‌‌ చేశారు.

యాక్సిడెంటల్‌ మెటీరియల్‌ను ఫోరెన్సిక్‌ టెస్టులకు తరలించారు. జెన్ కో ఆఫీసర్ల స్టేట్‌‌మెంట్ రికార్ట్ ‌‌చేసినట్లు తెలిసింది. గతంలో జరిగిన ప్రమాదాలు, వాటికి గల కారణాలను సీఐడీ టీమ్ ప‌రిశీలిస్తున్నది. పవర్ ప్లాంట్ లో 2001లో ఏర్పాటు చేసిన మెషిన్లలో టెక్నికల్ సమస్యలు ఏమైనా తలెత్తాయా అనే కోణంలో వివరాలు రాబడుతున్నది. ఫోరెన్సి క్‌ రిపోర్టు వచ్చేంత వరకు ప్రమాదానికి గల కారణాలు తేలిసే అవకాశం లేదని సమాచారం. పవర్ ప్లాంట్‌లో సీఐడీ దర్యాప్తు మరో మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
దరిదాపుల్లోకి అనుమతించలేదు
సీఐడీ టీం విచారణ జరుపుతున్న టైంలో స్థానిక పోలీసులు, జెన్ అధికారులు, సిబ్బంది మినహా ఇతరులను దరిదాపుల్లోకి రానివ్వలేదు. ప్రమాదం వల్ల జరిగిన నష్టం అంచనా, కాలిపోయిన మెషినరీ, ప్లాంట్ సీసీ కెమెరా ఫుటేజ్ పై జెన్ కో ఆఫీసర్ల‌ను
సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం