ఎలక్ట్రిక్​ బడ్జెట్​ హోటల్​

ఎలక్ట్రిక్​ బడ్జెట్​ హోటల్​

స్విండన్​ టౌన్​ సెంటర్​లో ఉన్న ప్రీమియర్​ ఇన్​ హోటల్ కూడా ఎన్విరాన్​​మెంట్​ ఫ్రెండ్లీగా అడుగులేస్తోంది. అందులో భాగంగా టౌన్​లోని హోటల్​లో​ రూఫ్​ సోలార్​ ప్యానెల్స్​ పెట్టింది. ఈ ప్యానెల్స్​ పెట్టకముందు గ్రిడ్​ నుంచి పవర్​ను వాడేవాళ్లు. ఈ ప్రీమియర్​ హోటల్స్​ గ్రూప్​ యు.కె., ఐర్లాండ్​లలో ఉన్నాయి. ఆ​ హోటల్స్​లో అన్నింటిలో ఈ ఏర్పాట్లు చేయించాలనుకుంటున్న వాళ్లు ముందుగా స్విండన్​ టౌన్​లో ఉన్న హోటల్​లో ట్రై చేశారు.

కర్బన ఉద్గారాలను తగ్గించే పనిలో భాగంగా టెస్ట్​ ప్రాజెక్ట్​ దీనితో మొదలుపెట్టారు. 2040 వరకు మెయిన్​ గ్యాస్​ కనెక్షన్​ను తీసేయడమే మా లక్ష్యం అంటోంది ఈ హోటల్​ గ్రూప్​. ఈ హోటల్​లో తక్కువ విద్యుత్​ వాడే లెడ్​ లైటింగ్​తో పాటు, ఎలక్ట్రికల్ ఎక్విప్​మెంట్​ ద్వారా విడుదలయ్యే హీట్​ను తిరిగి వాడుతున్నారు. అలాగే గాలికోసం వాడే హీట్​ పంప్స్​ ద్వారా హోటల్ బిల్డింగ్​లో అన్ని సీజన్లలో అనుకూలంగా​ ఉష్ణోగ్రతను మెయింటెయిన్​ చేస్తున్నారు.

‘‘యు.కె.లో మొదటి ఎలక్ట్రిక్​ బడ్జెట్​ హోటల్​ మాది. దాన్ని స్థిరంగా, అందుబాటులో ఉండేలా చేస్తున్నాం” అని ఈ హోటల్స్​ కన్​స్ట్రక్షన్​ హెడ్​ రిచర్డ్​ అల్డ్రెడ్​ చెప్పాడు.

 ‘‘ఈ హోటల్​లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్​ డిజైన్స్​ చూస్తే రద్దీగా ఉండే టౌన్​ సెంటర్​ లొకేషన్లలో కూడా అనుకున్నట్టు ఎలా చేయొచ్చో తెలుస్తుంది. ఈ హోటల్​లోని సూట్​, లో కార్బన్​ డిజైన్​ను యు.కె., ఐర్లాండ్​లో ఉన్న టౌన్​ సెంటర్లలో కూడా వాడతాం” అన్నాడు స్విండన్​ బోరౌ కౌన్సిల్​ లీడర్ జిమ్​ రాబిన్స్​.