Samantha: అది సాధించడం అంత ఈజీ కాదు.. ఫ్యాన్స్పై సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: అది సాధించడం అంత ఈజీ కాదు.. ఫ్యాన్స్పై సమంత షాకింగ్ కామెంట్స్

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తన ఫ్యాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పుట్టినరోజు సంధర్బంగా తన అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందించారు. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ బ్యూటీ సమంత ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన లైఫ్ లో జరిగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

ఇందులో భాగంగానే తాజాగా తన ఫ్యాన్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు సమంత. ఏప్రిల్ 28 ఆమె పుట్టినరోజు సంధర్బంగా తన అభుమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా స్పందించారు. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. నా మాటను గౌరవించే అభిమానులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఫాలో అవుతున్నవారిలో చాలామంది వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఉన్నవారు ఉన్నారు. వారిని చూసి చాలా విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను, కొత్త విషయాలపై అవగాహన తెచ్చుకున్నాను.. అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు సమంత. ప్రస్తుతం సామ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ మూవీ సిటాడెల్  హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.