నాలుగేళ్లు దాటిన పిల్లలు నైట్ అంత ఈజీగా పడుకోరు. జోలపాటలు పాడే రోజులు కూడా కావు. రాత్రి పది దాటినా ఇంకా ఆడుతుంటారు. ఈ విషయాల మీద వేస్బ్లత్ అనే అమెరికన్ పీడియాట్రిషియన్ ‘హెల్దీ స్లీప్ హ్యాబిట్స్, హ్యాపీ చైల్డ్’ అనే బుక్ రాశాడు. తన ఎక్స్‌పీరియెన్స్, ఎక్స్పరిమెంట్స్ ఈ పుస్తకంలో చెప్పాడు. నాలుగేళ్ల పిలగాడిని ఎలాంటి టెక్నిక్‌తో తొందరగా నిద్రకు అలవాటు చేయాలో చెప్పాడు. మొదట్లో ఆయనకు ఈ ఎక్స్పరిమెంట్ చేస్తే ఏమవుతుందో అని చిన్న భయం ఉండేది. కానీ ముందడుగు వేశాడు. ‘చక్కగా పడుకో.. కళ్లు మూసుకో.. మాట్లాడకు.. నిద్రపో..’ ఇలా చెప్తుంటే ఏ పిల్లలూ వినరు. అందుకని నిద్రపోయే ముందు ఒక ప్రామిస్ చేయాలంట. ‘ఉదయం లేవగానే నీకు నచ్చిన బొమ్మ ఇస్తా, పార్క్‌కి తీసుకెళ్తా, స్వీట్ చేసి పెడతా..’ అని చెప్పాలి. అయితే, అవి పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. కొద్ది రోజుల పాటు పిల్లలు ఆ రివార్డ్‌లను నమ్మేలా చేయాలి. ప్రతిరోజూ ఆ ప్రామిస్‌ని కచ్చితంగా ప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే.. రెండు నెలల్లో మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నాడు. స్లీపింగ్ టైమింగ్స్ అలవాటు అయ్యేంత వరకు.. ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని వేస్బ్లత్ చెప్పాడు.
