నేతన్నలపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది మొసలి కన్నీరు :విప్ ఆది శ్రీనివాస్

నేతన్నలపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది మొసలి కన్నీరు :విప్ ఆది శ్రీనివాస్
  • వారిని అప్పల పాల్జేసిందేబీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం: విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: నేతన్నలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల పేర నేతన్నలకు రూ.350 కోట్లు అప్పు పెట్టిన పాపం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌దే అని ఆరోపించారు. బీఆర్ఎస్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిందని గుర్తుచేశారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేండ్లలో జిల్లాలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి త్వరలోనే బయట పెడ్తామని చెప్పారు.

నేతన్నల పేరిట అక్రమాలకు పాల్పడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేత కార్మికులకు అనేక ఆర్డర్లు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే రాష్ట్రంలో పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దింపారని పేర్కొన్నారు.

రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గత 9 నెలల్లో ఒక్కరోజు కూడా విరామం లేకుండా పని చేస్తున్నారన్నారు. సీఎం ప్రారంభించిన ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో సిరిసిల్ల నుంచి 12 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని చెప్పారు. నేతన్నకు చేయూత (త్రిప్ట్ ఫండ్) కింద రూ.90 కోట్లు విడుదల చేశామన్నారు.