కోహ్లీ–సచిన్ లో ఎవరు బెస్ట్?

కోహ్లీ–సచిన్ లో ఎవరు బెస్ట్?

బుమ్రాకు యువీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనకు నెట్స్ లో బౌన్సర్లు, యార్కర్స్ తో చాలా ఇబ్బంది పెట్టేవాడని ఓ సందర్భంగా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. దీనికి యువీ ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే బ్యాటుతో కాదు.. ప్రశ్నలతో. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో పలు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో బుమ్రాను యువీ ఉక్కిరిబిక్కిరి చేశాడు. క్లిష్టమైన ప్రశ్నలకు కేవలం 5 సెకన్లలోనే జవాబులు చెప్పాలని షరతు పెట్టడంతో బుమ్రా ఒత్తిడికి లోనయ్యాడు. సరదాగా సాగిన ఈ సెషన్ లో బుమ్రాను యువీ చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగాడు.

ఫిట్ నెస్ లో ఎవరు బెస్ట్?
ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్వీడన్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ జ్లాటన్ ఇబ్రహిమోవిక్ లో ఎవరు నీకు ఫిట్ నెస్ లో స్ఫూర్తి అని యువీ తొలి ప్రశ్న అడిగాడు. జవాబుగా జ్లాటన్ పేరు చెప్పిన బుమ్రా.. ఫిట్ నెస్ విషయంలో కాదు గానీ సాధారణంగా అతడ్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటానని జవాబిచ్చాడు.

ఎవరు బెస్ట్ బ్యాట్స్ మన్?
విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లో ఎవరు బెస్ట్ బ్యాట్స్ మన్ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడడానికి బుమ్రా తడబడ్డాడు. ‘యువీ పాజీ.. నేను ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ చేసి నాలుగేళ్లే అయింది. కోహ్లీ–సచిన్ ను జడ్జ్ చేసేంత అనుభవం నాకు లేదు. వాళ్లు నా కంటే చాలా ఎక్కువ క్రికెట్ ఆడారు’ అని బుమ్రా అన్నాడు. ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిందేనని యువీ ఒత్తిడి చేయడంతో.. క్రికెట్ లో సచిన్ పాజీకి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. నా ఓటు ఆయనకేనని బుమ్రా చెప్పాడు.

యువీ, ధోనీల్లో ఎవరు ఫేవరెట్?
యువరాజ్ సింగ్ లేదా ఎం.ఎస్.ధోనీల్లో ఎవరు నీ ఫేవరెట్ బ్యాట్స్ మన్ అని యువీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. ‘మీ ఇద్దరూ కలసి ఇండియాకు ఇండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించారు. ఇలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నావ్ పాజీ’ అని యువీని బుమ్రా ప్రశ్నించాడు. వీళ్లందరూ తన ఫేవరెట్ ప్లేయర్సేనని, ఎవరో ఒకరిని ఎంపిక చేయడం కష్టమని, తాను అందరికీ ఫ్యాన్ అని పేర్కొన్నాడు.

బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ ఎవరు?
ఆర్.అశ్విన్ లేదా హర్భజన్ సింగ్ లో ఎవరు బెస్ట్ ఆఫ్​స్పిన్నర్ అన్న ప్రశ్నకు. . మరో కాంట్రవర్సీ ప్రశ్న అని బుమ్రా అన్నాడు. తాను అశ్విన్ తో కలసి ఆడానని.. చిన్నతనం నుంచి భజ్జీ పాజీ గేమ్ చూసి పెరిగినందున భజ్జీకే తన ఓటు అని బుమ్రా చెప్పాడు.