ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో (2026, ఏప్రిల్ 24l ) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని RCB ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లాలని పట్టుదలగా ఉంది. కాగా ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 4 విజయాలు, 2 ఓటములతో బెంగళూరు బలంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ కథా వేరే ఉంది. వరుసగా మూడు విజయాల తర్వాత, గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 99 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌తో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గిల్ సేన భావిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌండరీలు చిన్నవి కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 193పరుగులు. కాగా ముఖ్యంగా ఛేజింగ్ చేసే జట్లకే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా (75%) ఉన్నాయి. ఇక్కడి బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల సిక్సర్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. బౌలర్లకు ఇక్కడ పెద్దగా సహకారం ఉండదు, కాబట్టి ఇదొక హై-స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
►ALSO READ | MS Dhoni: ధోనీ కావాలనే చెన్నై సూపర్ కింగ్స్‌కి దూరంగా ఉంటున్నాడు..
ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారంటే!:
ప్రస్తుత ఫామ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూస్తుంటే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ముంబై ఇండియన్స్ చేతిలో ఎదురైన అవమానకర ఓటమికి బదులు తీర్చుకోవాలని గుజరాత్ టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం మాత్రం ఉంది.

