మామా మశ్చీంద్ర అంటే..? .. ప్రేక్షకులకు పజిల్

మామా మశ్చీంద్ర అంటే..?  .. ప్రేక్షకులకు పజిల్

సుధీర్ బాబు హీరోగా నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇందులో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే  మూడు క్యారెక్టర్స్‌‌కి సంబంధించి లుక్స్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. తాజాగా టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14న టీజర్‌‌‌‌ను విడుదల చేయనున్నట్టు వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా టైటిల్‌‌ను మాయ మశ్చీంద్ర కాకుండా.. ‘మామా మశ్చీంద్ర’ అని  ఎందుకు పెట్టామో తెలుసుకోవాలని ప్రేక్షకులకు పజిల్ ఇచ్చారు.

టీజర్ రిలీజ్ రోజున.. కరెక్ట్‌‌గా చెప్పిన మొదటి పది మందికి మూవీ టీమ్ పార్టీ ఇవ్వనుందని ప్రకటించారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.