నా రాజీనామాకు అసలు కారణం అదే.. తేల్చి చెప్పిన నితీష్ కుమార్

నా రాజీనామాకు అసలు కారణం అదే.. తేల్చి చెప్పిన నితీష్ కుమార్

బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించిన ఆయన.. ఈ రోజు తాను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేశానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయమని గవర్నర్‌కు కూడా చెప్పానన్నారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగ్గా లేనందునే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త కూటమి ఏర్పాటు చేస్తానని నితీష్.. అందరి నుండి అభిప్రాయాలను తీసుకున్నాని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం రద్దయిందన్నారు. రాజీనామా లేఖను గవర్నకు సమర్పించిన అనంతరం ఆయన ఈ కామెంట్స్ చేశారు.

సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయడంతో బిహార్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ రోజు సాయంత్రం 4గంటలకు బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు సమావేశం నిర్వహిస్తున్నారు