హైదరాబాద్​లో వింగ్స్​ ఇండియా- 2024 ప్రోగ్రాం

హైదరాబాద్​లో వింగ్స్​ ఇండియా- 2024 ప్రోగ్రాం

 

  • జనవరిలో బేగంపేట ఏయిర్​పోర్ట్​లో నిర్వహిస్తం: సింధియా

న్యూఢిల్లీ, వెలుగు:  హైదరాబాద్ వేదికగా ‘వింగ్స్ ఇండియా-–2024’ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 18- నుంచి 21వ తేదీ బేగంపేట ఏయిర్ పోర్ట్ లో దీన్ని జరపనున్నట్లు తెలిపారు. ‘వింగ్స్ ఇండియా-2024' కు సంబంధించిన కర్టెన్ రైజర్ ఆవిష్కరించారు. తర్వాత సింధియా మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 148 ఎయిర్ పోర్ట్ లు, హెలీపోర్టులు, వాటర్ డ్రోమ్ ల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు తెలిపారు. రానున్న  నాలుగేండ్లలో వీటి సంఖ్యను దాదాపు 2300 కు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఆయన వెంట ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చైర్మన్ సంజీవ్ కుమార్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.