- బంగారం, ఆస్తులు, కారు కొనుగోలు
హైదరాబాద్సిటీ, వెలుగు : తాను క్యాన్సర్తో బాధపడుతున్నానంటూ అబద్దం చెప్పి చికిత్స కోసం డబ్బులు కావాలని ఓ బిల్డర్నుంచి రూ.6.5 కోట్లు వసూలు చేసిందో మహిళ.. ఇందులో ఆమె భర్త సుజిత్కూడా సహకరించడంతో ఇద్దరిపై మధురానగర్పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఎల్లారెడ్డిగూడకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బిల్డర్. వసంత నగర్ కు చెందిన వాసిరెడ్డి స్వాతి, మల్లికార్జున్రెడ్డి పరిచయస్తులు. తనకు ప్రాణాంతకమైన క్యాన్సర్సోకిందని మల్లికార్జున్ను నమ్మించిన స్వాతి చికిత్స కోసం డబ్బు కావాలని అడిగింది.
మల్లికార్జున్కుటుంబం నుంచి విడతల వారీగా రూ.6.5 కోట్లు తీసుకుంది. నయమైన తర్వాత తమ వద్ద ఉన్న బంగారం లేదా భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ డబ్బులతో ఆస్తులు, బంగారం, కారు కొన్నట్టు మల్లికార్జున్రెడ్డికి తెలిసింది.
దీంతో ఇటీవల తన డబ్బులు తనకు కావాలని అడగ్గా ఆత్మహత్య నోట్ రాసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని స్వాతితో పాటు ఆమె భర్త బెదిరించాడు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
