అమృతా ఫడ్నవీస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ అరెస్ట్

అమృతా ఫడ్నవీస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ అరెస్ట్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఫేస్ బుక్ లో వేధింపులకు గురయ్యారు. గుర్తు తెలియని ఓ మహిళ నుంచి అమృతా ఫడ్నవీస్ కు రిక్వెస్ట్ రాగా.. దానిని ఆమె యాక్సెప్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి సదరు మహిళా అనుచిత, అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతోంది. దీనిపై విసిగిపోయిన అమృతా ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చాలా సిరీయస్ గా తీసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలు స్మృతి పంచల్ గా గుర్తించి..ఆమెపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో స్మృతి పంచల్ 53 ఫేస్ బుక్ నకిలీ ఖాతాలను, 13 జీ మెయిల్ ఖాతాలను క్రియేట్ చేసినట్టుగా గుర్తించారు.