ఖైరతాబాద్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వచ్చిందనుకుని తలుపులు తెరిచిన మహిళ.. లిఫ్ట్ షాఫ్ట్ లో పడిపోయి తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఖైరాతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని భావనా అపార్ట్‌మెంట్స్‌లో జరిగింది ఈ ఘోర ప్రమాదం.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. . రాధ (58) అనే మహిళ 13 నెలల మనవడు జియోల్ ను ఎత్తుకుని 5వ ఫ్లోర్ లో లిఫ్ట్ కోసం వేచిచేస్తూ ఉన్నది. ఈ క్రమంలో లిఫ్ట్ రాకముందే వచ్చినట్లు భావించి లిఫ్ట్ తలుపులు తెరిచింది. ప్రమాద వషాత్తు లిఫ్ట్ షాఫ్ట్ లో బాబుతో సహా పడిపోయింది. 1వ ఫ్లోర్ వరకు పడిన ఆమె తీవ్రగా గాయపడింది.
ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె 13 నెలల మనవడు జియోల్ గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నారు.
