మరణంలోనూ కొడుకు చేయి వదలని తల్లి.. జబల్పూర్ పడవ ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

మరణంలోనూ కొడుకు చేయి వదలని తల్లి.. జబల్పూర్ పడవ ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

కన్న బిడ్డలకు ఆపద వస్తుందంటే ఏ తల్లి అయినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుకోవాలని చూస్తుంది. అందుకోసం ఎంత సాహసం అయినా చేస్తుంది. పాపం ఆ మాతృమూర్తి కూడా అలాగే ప్రయత్నించిందేమో. పడవ మునిగి పోతుంటే కొడుకును కాపాడుకునేందుకు ఎంత తల్లడిల్లిందో. చివరికి మరణం తప్పదని భావించి.. తన నాలుగేళ్ల ఏళ్ల బిడ్డను ఒడిలోనే హత్తుకుని పట్టుకుంది. తను బతకకపోయినా.. తన కడుపు పేగు బతకాలని ఎంత  ఏడ్చిందో.. నదిలో కలిసిపోయిన కన్నీళ్లు ప్రపంచం చూడకపోయినా.. ఆమె కొడుకును హత్తుకున్న తీరు.. చూసిన వాళ్లకు కన్నీళ్లు తెప్పించక మానదు.

2026 మే 01 అర్థరాత్రి మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో జరిగిన పడవ ప్రమాదంలో 8 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బార్గి డ్యామ్ లో 29 మందితో ఉన్న బోటు మునక ఘటనలో 9 మంది చనిపోయారు. ఇప్పటికి 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. చాలా మంది మిస్సైయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అదికారులు చెబుతున్నారు. 


29 మందితో ఉన్న టూరిస్టు బోటు..  ఖమరియా ద్వీపం సమీపంలోకి  వచ్చినప్పుడు సడెన్​గా తుపాన్ ఏర్పడింది. ఈ ధాటికి బోటు నీట మునిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీళ్లలో పడిన వారిలో 15 మంది పర్యాటకులను రెస్క్యూ టీమ్​లు కాపాడాయని, 14 మంది గల్లంతవగా.. అందులో 9 మంది చనిపోయినట్లు తెలిపారు. గల్లంత్తైన వారికోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 6 గంటలకు తుపాను కారణంగా నీళ్లు ఎగసిడటం గమనించారు. బోటు వెనకకు తిప్పమని ప్యాసెంజర్లు హాహాకారాలు చేశారు. పడవను బెనకకు తిప్పేందుకు ప్రయత్నించే లోపే రాకాసి అలల్లా నీళ్లు పడవను ముంచేశాయి. అక్కడే ఉన్న స్థానికులు తాళ్ల సాయంతో కొందరిని కాపాడగలిగారు. ముఖ్యంగా లైఫ్ జాకెట్స్ ధరించిన వారిని కాపాడారు. సేఫ్టీ మెజర్స్ పాటించి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదని ప్రాణాలతో బయటపడిన టూరిస్టులు చెబుతున్నారు.