24 ఏళ్ల యువకుడు 36 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన కలకలం రేపింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండగా గ్రామస్తులు పట్టుకోవడంతో.. దగ్గరుండి భార్యకు యువకునితో పెళ్లి చేయించాడు భర్త. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నలంద జిల్లాలోని కత్వర్సాపూర్ గ్రామంలో వయసులో 12 గ్యాప్ ఉన్న ఇద్దరికీ పెళ్లి చేశారు గ్రామస్తులు. యువకుడు ఎవరూ లేని సమయంలో మహిళ ఇంటికి వెల్లగా నిఘా ఉంచి పట్టుకున్నారు గ్రామస్తులు.
సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ ప్రశ్నించగా.. ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పారు. పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు.
విషయం తెలిసిన భర్త.. భార్యతో బంధాన్ని తెంచుకుంటానని చెప్పాడు. అదేవిధంగా యువకునితో పెళ్లికి అంగీకరించాడు. దీంతో గ్రామస్తుల సమక్షంలో దగ్గరుండి పెళ్లి చేశాడు భర్త.
