బషీర్‌బాగ్, వెలుగు: గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. నారాయణగూడ అడ్మిన్ ఎస్సై నరేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన లాయర్ జైపాల్‌రెడ్డి పెద్ద కుమార్తె (27) లహరికి హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన వల్లభ్ రెడ్డితో గతేడాది ఏప్రిల్‌లో పెండ్లి జరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు జైపాల్ రెడ్డి హైకోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో భార్య అతడికి ఫోన్ చేసింది. కూతురు లహరి అత్తగారింట్లో కళ్లు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్చించారని చెప్పింది. వెంటనే జైపాల్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లాడు. పల్స్ రేట్ తగ్గడంతో ఉదయం 11 గంటలకు లహరి గుండెపోటుతో చనిపోయిందనిడాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం..
సికింద్రాబాద్: రాజ్‌భవన్ రోడ్లో శుక్రవారం ఓ వ్యక్తి గుండెపోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గుర్తించిన బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది శివకుమార్ వెంటనే సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకొచ్చాడు.ఆ తర్వాత అతడిని అంబులెన్స్‌లో దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు వెళ్లిన15 నిమిషాల వరకు పల్స్ బాగానే ఉన్నా.. తర్వాత పల్స్ రేట్ పడిపోవడంతో సదరు వ్యక్తి గుండె
పోటుతో చనిపోయాడు.

