దొంగతనానికి వచ్చి బిడ్డను మరిచిపోయింది

దొంగతనానికి వచ్చి బిడ్డను మరిచిపోయింది

న్యూజెర్సీ: ఎవరైనా దొంగతనానికి వచ్చేముందు ఏం చేస్తారు..కత్తులు, తుపాకీలతో వస్తారు కదా. కానీ ఓ మహిళ తొటి మహిళా దొంగతో కలిసి మూడు సంవత్సరాలున్న బిడ్డను తీసుకువచ్చి..ఊహించని విధంగా పోలీసులకు చిక్కింది. ఈ ఘటన న్యూజెర్సీలో చోటు చేసుకుంది.

వివరాలు : ఓ మహిళ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఓ షాప్‌ కు దొంగతనానికి వెళ్లింది. అక్కడికి తన బిడ్డను కూడా తీసుకెళ్లింది. తన ఇద్దరు స్నేహితులు స్టోర్‌ సిబ్బందితో మాటలు కలిపి వారి దృష్టి మరల్చగా.. ఆమె స్ట్రోలర్‌ను(పిల్లలు కూర్చునే చక్రాల కుర్చీ) తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే ఆ మహిళ స్ట్రోలర్‌ ను తీసుకెళ్లే క్రమంలో ..తన బిడ్డను స్టోర్‌ లోనే వదిలేసిన సంగతి మరచిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తన ఇద్దరి స్నేహితులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. కాసేపటి తర్వాత బిడ్డ లేని విషయం గమనించి.. తిరిగి స్టోర్‌ కు వెళ్లారు. అప్పటికే చోరీ విషయం CCTVలో గుర్తించిన స్టాఫ్.. ఆ మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్‌ అయ్యింది.