ర్యాంకు వచ్చినా జాబ్ ఇస్తలేరు.. హరీశ్ రావును అడ్డుకున్నమహిళ

ర్యాంకు వచ్చినా జాబ్ ఇస్తలేరు.. హరీశ్ రావును అడ్డుకున్నమహిళ
  • న్యాయం చేయాలంటూ హరీశ్ రావుని అడ్డుకున్న మహిళ

రామచంద్రాపురం, వెలుగు: మున్సి పల్ ఎన్నికల నేపథ్యం లో సోమవారం తెల్లా పూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు వచ్చిన మంత్రి హరీశ్ రావుని ఓ మహిళ అడ్డుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మంత్రి వాహనం ముందు బైఠాయించి హంగామా చేసింది. వెస్ట్​మారేడ్ పల్లిలో నివసించే అరుంధతి తనకు డీఎడ్ లో ర్యాంక్ వచ్చిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం జాబ్ ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించింది. ఎస్జీటీ టీచర్ అర్హతసాధించినా బీసీ డి రిజర్వేషన్ కారణంతో తనను లిస్టులో నుం చి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఒరిజినల్ సర్టిఫికెట్, వెరిఫికేషన్ పేపర్లు తీసుకుని మంత్రి హరీశ్ రావుని నాలుగు నెలలుగా కలుస్తూనే ఉన్నా తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించిం. ఉద్యోగం ఇవ్వకపోతే తనలాంటి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాల
కూడా తెల్లా పూర్ లో ఇండిపెండెంట్ గా మున్సి పల్ ఎలక్షన్స్​లో పోటీ చేస్తానని పేర్కొం ది. మంత్రి వెళ్లిపోయినా చాలాసేపు రోడ్డుపైనే బైఠాయబైఠాయించి సర్టిఫికెట్లను కింద పరిచి ఆందోళన చేసింది.