అమ్మాయిలు ఏడాదిలో 71 రోజులు ఫోన్‌కు అతుక్కుపోతున్నారట. అబ్బాయిలతో పోలిస్తే ఇది రెండు వారాలు ఎక్కువట. ది స్టడీ ఫర్ టిక్ వాచెస్ ఈమధ్య బ్రిటన్‌లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రోజులో 4 గంటల 42 నిమిషాలు అమ్మాయిలు ఫోన్‌తోనే గడిపేస్తున్నారని సర్వే చెప్పింది. అదే అబ్బాయిలు 3 గంటల 49 నిమిషాలు వాడుతున్నారంది. ఫోన్ ఎక్కువగా వాడుతున్న వారిలో ముందుంది లండన్ వాళ్లని సర్వే తేల్చింది. వీళ్లు రోజులో 5 గంటలు ఫోన్ వాడుతున్నారని చెప్పింది. రేసులో సౌథాంప్టన్ వాళ్లు చివరన ఉన్నారని, వీళ్లు యావరేజ్‌గా రోజులో 3 గంటలకు తక్కువగానే ఫోన్ వాడుతున్నారని వివరించింది.
