బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎలక్షన్లలో..రిజర్వేషన్లు కావాలి

బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎలక్షన్లలో..రిజర్వేషన్లు కావాలి
  • హైకోర్టులో మహిళా  అడ్వకేట్స్‌‌‌‌ ఆందోళన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మహిళా అడ్వొకేట్స్  హైకోర్టు బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ వద్ద ఆందోళన చేశారు. బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎన్నికల్లో తమకు 30 శాతం రిజర్వేషన్‌‌‌‌ కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ జారీ కానందున సుప్రీం కోర్డు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేస్తామని చెప్పారు. 

 బార్‌‌‌‌ కౌన్సిల్‌లో ఇప్పటివరకు మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమన్నారు. జి.సుభాషిణి, శారద గుండ్రాతి, ప్రేమలత, రజిత, సుమిత్రాదేవి, చందన, జయశ్రీ, ఊర్మిళ, శ్రీలత, స్వేత తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. మహిళ ఆందోళనకు హెచ్‌‌‌‌సీఏఏ అధ్యక్షుడు జగన్, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి మద్దతు పలికారు.