బొల్లారంలో మహిళ దారుణ హత్య... బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి... కత్తితో గొంతు కోసి...

బొల్లారంలో మహిళ దారుణ హత్య... బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి... కత్తితో గొంతు కోసి...

సంగారెడ్డి జిల్లా బొల్లారంలో దారుణం జరిగింది. బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి మహిళను కత్తితో గొంతు కోసి చంపేశారు దుండగులు. ఆదివారం ( మే 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అనిల్, మీనా దంపతులు బైక్ పై సంతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా... ఐడీఏ క్రీడా ప్రాంగణం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు.

మీనాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దుండగులను అడ్డుకున్న అనిల్ పై కత్తితో దాడి చేశారు. ఆపై మీనాను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనలో మీనా అక్కడికక్కడే మృతి చెందగా.. అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

తీవ్ర గాయాలపాలైన అనిల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనిల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.