కారును పెట్రోల్ తో కడిగిన మహిళ

కారును పెట్రోల్ తో కడిగిన మహిళ

పెట్రోల్.. ఈ మాట వినగానే ధర గుర్తుకొస్తుంది. ఎందుకంటే అంత కాస్ల్టీ.. లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలంటేనే అమ్మో అనుకునే రోజులు.. భవిష్యత్ తో పెట్రోల్ అయిపోతుందని..దొరకదనే ఉద్దేశంతో.. ప్రపంచం మొత్తం సోలార్ వైపు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ తన కారును శుభ్రంగా పెట్రోల్ తో కడిగేసింది. అది కూడా పెట్రోల్ బంకులోనే.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. 72 గంటల్లోనే కోటి వ్యూస్ తో ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. ఏ దేశంలో ఈ ఘటన జరిగింది అనేది లేకపోయినా.. ఔట్ ఆఫ్ కాన్ టెక్ట్స్ హ్యూమన్ రేస్ అధికారిక ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయ్యింది.

https://twitter.com/NoContextHumans/status/1649299862746288131

మన దేశంలో అయితే పెట్రోల్ బంకుల్లో మనుషులు ఉంటారు.. మిగతా చాలా దేశాల్లో ఎవరి పెట్రోల్ వాళ్లే కొట్టుకోవాలి. ఈ సందర్భంలోనే పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ మహిళ పెట్రోల్ కొట్టుకుని.. ఆ తర్వాత అదే గన్ తో.. శుభ్రంగా పెట్రోల్ తో కారు కడుక్కన్నది ఆ మహిళ. పెట్రోల్ తో కారు కడగటం అనేది స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అయితే పెట్రోల్ తో కారును వాష్ చేస్తున్న సమయంలో కారు ఆన్ లో ఉందా లేదా అనేది తెలియరాలేదు. ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది. పెట్రోల్ తో కారు వాష్ చేసుకున్న తర్వాత కారు ఆన్ చేసుకుని వెళ్లిపోవటం మరో విశేషం. 

సహజంగా ఇలాంటి ఐడియాలు, ఇలాంటి ఆలోచనలు మామూలోళ్లకు రావు.. తెలివి ఎక్కువైతే కానీ ఇలాంటివి చేయరంటున్నారు నెటిజన్లు. మరికొందరు అయితే మీలాంటోళ్లు ఉండాలమ్మా ఉండాలి.. సమాజంలో మీరు వెరీ స్పెషల్ అంటూ చురకలు అంటిస్తున్నారు. కలలో కూడా రాని ఆలోచనలను ఇలా చేస్తున్నారంటే ఆ మహిళ నిజంగా గ్రేట్ అంటున్నారు మరి కొందరు. ఏది ఏమైనా బండిలో పెట్రోల్ కొట్టించుకోవటానికి చెమటలు కక్కుతున్నాం.. అలాంటిది ఏకంగా కారును పెట్రోల్ తో కడగటం అంటే మాటలా ఏంటీ అంటున్నారు మరికొందరు నెటిజన్లు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లో 85 లక్షల మంది చూడటమే కాకుండా వేలాది మంది లైక్, షేర్ చేయటం విశేషం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వింతలు బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో కదా.. మొత్తానికి ఆ మహిళ ఆలోచనకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఉండాలమ్మా.. మీలాంటోళ్లు ఉండాలి..