మహిళల్లో రోజురోజుకి ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఇప్పటిదాకా మగవాళ్లదే పైచేయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తోంది. ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా ప్రకారం 2015–18 కాలంలో రుణాలు తీసుకున్న వారిలో మహిళలు 48 శాతం పెరగ్గా, మగవారు 35 శాతానికే పరిమితమయ్యారు. ప్రతీ సంవత్సరం కొత్తగా రుణాలు తీసుకునే మహిళల సంఖ్య 86 లక్షలదాకా ఉంటోంది. రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న మహిళల్లో 66 శాతం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండే ఉన్నారు. మహిళల నుండి రుణాలకు డిమాండ్ పెరగడం బ్యాంకులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. మహిళల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్రాడక్ట్స్‌ను కస్టమైజ్ చేసి మరింత బాగా సేవలను అందించే అవకాశం ఉంటుంది.
మహిళలు నడుపుతున్న ఎమ్ ఎస్ ఎమ్ఈలున్న రాష్ట్రాలనుండి బిజినెస్ లోన్లు ఎక్కువగా వస్తున్నట్లు ట్రాన్స్ యూనియన్ సిబిల్ గుర్తించింది. మహిళా ఆధారిత ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ పాలసీలు ఈ వృద్ధికి మరింత దోహదపడుతున్నాయి. మహిళల నుండి మరింత క్రెడిట్ డిమాండ్ మహిళల్లో పెరుగుతున్న అక్షరాస్యత, ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య పెరగడంతో పాటు టైర్1, టైర్2 నగరాల్లో కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ వినియోగం పెరగడం వంటివాటితో భవిష్యత్ లో మహిళల నుండి మరింత క్రెడిట్ డిమాండ్ ను చూడవచ్చని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్స్ విషయంలో పైన తెలిపిన ఐదు రాష్ట్రాల్లో కెల్లా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 781 సిబిల్ స్కోర్‌తో తక్కువ రిస్క్ కలిగిన రాష్ట్రాలుగా నిలిచాయి. మహిళల వయస్సుతో పాటు సగటు సిబిల్ స్కోర్ కూడా పెరుగుతూ వస్తోంది. 35 యేళ్ల లోపు మహిళల సగటు సిబిల్ స్కో ర్ 773 కాగా, 35–45 యేళ్ల వయస్సు గల మహిళల సిబిల్ స్కో ర్ 776 గా ఉంది. ఇక 45 యేళ్ల పైబడిన మహిళల సగటు సిబిల్ స్కో ర్ 785గా నమోదైంది. ఇండియన్ వుమెన్ కన్జ్యూ మర్స్ సగటు సిబిల్ స్కోర్ 770 కిపైగా ఉంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మంచి స్కోర్‌గా భావించవచ్చు.
గోల్డ్ లోన్స్‌దే పైచేయి
గత నాలుగేళ్లలో తీసుకున్న లోన్లను పరిశీలిస్తే గోల్డ్ లోన్స్ మొదటి స్థానంలో ఉంది. 2018 లో వీటికి డిమాండ్ 13 శాతం తగ్గినప్పటికీ 56 లక్షలకు పైగా ఆకౌంట్లతో ఇదే లీడింగ్‌లో ఉంది. తరువాతి స్థానంలో బిజినెస్ లోన్లు ఉన్నాయి. ఇతర లోన్లకు కూడా యేటా డిమాండ్ పెరుగుతూవస్తోంది. 2017–18 కాలంలో కన్జ్యూ మర్ లోన్లకు 31 శాతం, పర్సనల్ లోన్లకు 19 శాతం, టూ వీలర్ లోన్లకు 14 శాతం డిమాండ్ పెరిగింది. 27 శాతం లోన్ షేర్ తో తమిళనాడు ముందంజలో ఉండగా, 13 శాతం లోన్ షేర్ తో కేరళ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 10 శాతం లోన్లతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఎక్కువ మంది మహిళలు తమ లోన్ జర్నీని ప్రారంభించడం ప్రోత్సాహకరమని, దీంతో క్రెడిట్ అవేర్‌నెస్ పెరుగుతుందని ట్రాన్స్ యూనియన్ సిబిల్ వైస్ ప్రెసిడెంట్ సుజాత అహ్లావట్ తెలిపారు. 38 శాతం మహిళలు తమ సిబిల్ స్కోర్‌ను తరచూ గమనిస్తున్నారని, ఇది క్రెడిట్ డిసిప్లిన్ ను కలిగిస్తుందని అన్నారు.
ధీమా కోసం బీమాపై ఆసక్తి
భవిష్యత్ లో అవసరాలు ఎలా ఉంటాయో, జీవితంలో ఏం జరుగుతుం దనే దాన్ని ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేరు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ ఎల్ ఐ) ప్రొటెక్షన్ సర్వే 2018 ప్రకారం ఇండియాలో 25–50 యేళ్ల
వయస్సున్న 85 శాతం మహిళలు తమ జీవితం భవిష్యత్ లో చాలా అనిశ్చితితో ఉంటుందని భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఈ భావన పెరుగుతూ వస్తుండడంతో బీమా చేయించుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. జీవిత బీమాలో మగవారి కంటే మహిళలే ముందంజలో ఉన్నారు.
