బరువు తగ్గాలంటే ఎలాంటి ఎక్సర్​సైజ్ చేయాలి?

బరువు తగ్గాలంటే ఎలాంటి ఎక్సర్​సైజ్ చేయాలి?

బరువు తగ్గడానికి రకరకాల వర్కవుట్లు చేస్తుంటారు చాలామంది. అయితే,  ఎలాంటి బరువులు ఎత్తాలి? ఎంత సేపు ఎక్సర్​సైజ్​  చేయాలి? అనేది చాలా ముఖ్యం అంటున్నాడు సెలబ్రిటీ ట్రైనర్ శివోహం. వెయిట్​ ట్రైనింగ్​ కోసం డంబెల్​, కెటిల్​బాల్​తో వర్కవుట్లు చేస్తారు. అయితే, వీటిలో ఏది? ఎప్పుడు ఉపయోగించాలో చెప్తున్నాడు. 

  • డంబెల్స్, కెటిల్​బాల్స్​ బరువు ఒకేలా ఉండదు. కెటిల్​బాల్​ బరువు మొత్తం హ్యాండిల్ కింద ఉంటుంది. కానీ, డంబెల్స్​లో మాత్రం  రెండు వైపులా బరువు ఉంటుంది. కాబట్టి డంబెల్స్​తో వర్కవుట్ చేయడం ఈజీ.  
  • కెటిల్​బాల్స్​ కంటే డంబెల్స్​తో రకరకాల ఎక్సర్​సైజ్​లు చేయొచ్చు. పుల్లింగ్, పుషింగ్ వర్కవుట్​ చేసేందుకు డంబెల్ బెటర్​. దీంతో, ముంజేతులు గట్టిపడతాయి. డంబెల్స్​తో బెంచ్ ప్రెస్,  పుష్​ ప్రెస్, స్క్వాట్స్ వంటివి చేయొచ్చు. 
  • స్వింగ్స్​, స్నాచెస్ వంటి ఎక్సర్​సైజ్​లు చేయడానికి కెటిల్​బాల్ ఎంచుకోవాలి. వీటితో భుజం, వీపు దగ్గరి కండరాలు ఈజీగా కదులుతాయి. స్ట్రాంగ్ అవుతాయి కూడా.