ఇండియాకు వరల్డ్ బ్యాంక్​ 100 కోట్ల డాలర్ల ప్యాకేజీ

ఇండియాకు వరల్డ్ బ్యాంక్​ 100 కోట్ల డాలర్ల ప్యాకేజీ

వాషింగ్టన్: కరోనా కష్ట కాలంలో ఇండియాకు వరల్డ్ బ్యాంక్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలోని పట్టణ పేదలు, వలస కార్మికుల సోషల్ ప్రొటెక్షన్ కోసం దాదాపు 100 కోట్ల డాలర్ల( రూ. 75,49,00,00,000 ) నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న 400 కు పైగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ నిధులు ఉపయోగంలోకి వస్తాయని పేర్కొంది. ఆరోగ్యం, సామాజిక భద్రత, చిన్న..మధ్య తరహా పరిశ్రమల కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వివిధ దేశాలకు 160 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని అందించే ప్రణాళికను ప్రపంచ బ్యాంక్ పోయిన నెలలోనే ఆమోదించింది. ఈ మేరకు ఆయా దేశాలకు నిధులు ప్రకటిస్తోంది.
“సామాజిక భద్రత విషయంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదలకు కరోనాకు ముందు పరిస్థితిని తేవడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం”అని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు.
లాక్​డౌన్​ ఎఫెక్టుతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా  20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిరోజుల కిందటే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు  ‌పంచ‌వ్యాప్తంగా 44 ల‌క్ష‌లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. చనిపోయిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది.