ఏపీలో వారి అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే.. ఈసీ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వారి అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే.. ఈసీ కీలక వ్యాఖ్యలు..

2024 సార్వత్రిక ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఐదేళ్లుగా అమల్లో ఉన్న పలు సంక్షేమ పథకాల పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం.  ఈ నేపథ్యంలో పథకాల పంపిణీ నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు సంక్షేమ పథకాలకు నిధులు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఏముందో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఈ క్రమంలో పథకాల పంపిణీ పై ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ముగిసేవరకు సంక్షేమ పథకాలు విడుదల చేయద్దని, ఎన్నికలు ముగిసాక పథకాలు విడుదల చేసుకోవచ్చని తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పథకాలు నిలిపివేయటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని అధికార వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.