
మెడెలిన్: వరల్డ్ కప్ స్టేజ్‑3లో ఇండియా ఆర్చరీ రికర్వ్ టీమ్ బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకుంది. గురువారం జరిగిన పోటీల్లో తుషార్ షెల్కే‑మ్రినాల్ చౌహాన్–ధీరజ్ బొమ్మదేవరతో కూడిన ఇండియా టీమ్ 5‑3 (58‑54, 55‑56, 54‑53, 56‑56)తో చైనాను ఓడించి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. విమెన్స్ కేటగిరీలో భజన్ కౌర్–సంగీతా–తానిషాతో కూడిన ఇండియా టీమ్ రెండో రౌండ్‌లో 3‑5 (52‑51, 53‑54, 49‑55, 52‑52)తో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. విమెన్స్ రిక్వర్ క్వాలిఫికేషన్‌లో భజన్ టాప్–10లో నిలిచింది.