
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్ల ఫస్ట్ లుక్స్‌ను వరుసగా నాలుగు రోజుల పాటు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మొదట ఐశ్వర్యా రాజేష్ లుక్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తలకి టవల్ చుట్టుకుని సంప్రదాయ బద్దంగా ఉంది ఐశ్వర్య. శీనయ్యగా విజయ్, అతని భార్య సువర్ణగా ఐశ్వర్య కనిపించారు. శుక్రవారం ఇజబెల్లాతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె పాత్ర పేరు ఇజా. ఐశ్వర్యతో ఉన్న విజయ్, ఇజాతో ఉన్న విజయ్ డిఫరెంట్ లుక్‌లో ఉన్నారు. ఇజా కూడా అతన్ని గౌతమ్ అంటోంది. మరి నలుగురు హీరోయిన్లతో ఉన్న విజయ్‌లు వేర్వేరా లేక ఒక్కడే ఇంతమందితో రొమాన్స్ చేస్తాడా అని క్యూరియాసిటీ కలుగుతోంది. ఈ రోజు క్యాథరీన్ థ్రెసా, రేపు రాశీఖన్నాల లుక్స్ రిలీజ్ చేయనున్నారు. జనవరి 3న టీజర్‌ను విడుదల చేస్తారు.