V6 News

వరల్డ్ పాస్ వర్డ్ డే.. మంత్రి ఫన్నీ అండ్ సేఫ్టీ పోస్ట్ వైరల్

వరల్డ్ పాస్ వర్డ్ డే.. మంత్రి ఫన్నీ అండ్ సేఫ్టీ పోస్ట్ వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్.. తాజాగా ఓ ఇంట్రస్టింగ్, ఫన్నీ, అండ్ సేఫ్టీ పోస్ట్ చేశారు. వివిధ లైఫ్ కోట్స్, తన చుట్టు పక్కల ప్రాంతాల్లోని సుందరమైన దృశ్యాలను షేర్ చేసే ఆయన.. పోస్ట్ చేసిన ప్రతి వీడియో లేదా ఫొటో వైరల్ అవడం మామూలు విషయమే. అయితే మే నెలలో వచ్చే మొదటి గురువారం (మే 4) ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవం సందర్భంగా.. ఆయన ఓ వీడియో షేర్ చేశారు. మంత్రి అలోంగ్ పోస్ట్ చేసిన ఈ మీమ్ లో.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఉన్నారు. దీనికి జోడీగా ఓ ఆముఖ్యమైన క్యాప్షన్ ను కూడా ఆయన రాసుకొచ్చారు.

"ఈ #ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవం. మీరు మీ "గర్ల్‌ఫ్రెండ్‌నేమ్123@"ని పాస్‌వర్డ్‌గా ఉంచారన్న నిజమైతే.. వెంటనే దాన్ని ఈరోజే మార్చుకోండి. మీ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోండి" అంటూ మంత్రి అలోంగ్  తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 25వేల వ్యూస్, 800 పైగా లైక్‌లు వచ్చాయి. అంతే కాకుండా ఈ పోస్టుకు నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు.

"ఉత్తమ పాస్‌వర్డ్ పాస్‌వర్డ్ @Alongwithtemjenimna" అని యూజర్ కామెంట్ చేయగా.." "ఒకరి కంటే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవారి పాస్‌వర్డ్ ఎలా ఉండాలో కూడా దయచేసి సూచించండి" అని మరొకరు ట్విట్టర్‌లో తెలిపారు.