వీడియో: కరోనాపై వరల్డ్స్ షార్టెస్ట్ హార్రర్ ఫిల్మ్

వీడియో: కరోనాపై వరల్డ్స్ షార్టెస్ట్ హార్రర్ ఫిల్మ్

ఇప్పుడు ప్రపంచంలో కరోనా గురించి తెలియని వారుండరు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇప్పటికే 3 వేల మందికి పైగా మరణించారు. ఈ వైరస్ ఎలా సోకుతుందోనని చాలా మంది అసలు ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ వైరస్ గాలి ద్వారా సోకదని ఇప్పటికే చాలా మంది వైద్యులు స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన వారు పక్క వారి మీద దగ్గినా, తుమ్మినా ఇది వ్యాపిస్తుంది. వైరస్ బాధితులు పట్టుకున్న వస్తువులను మనం పట్టుకొని.. ఆ చేతులను మొహంపై పెట్టుకుంటే మనకు కూడా వ్యాపిస్తుంది.

కరోనా అలర్ట్ గురించి తెలియజేస్తూ.. సింగర్ కమ్ యాక్టర్ స్మిత ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వరల్డ్స్ షార్టెస్ట్ హార్రర్ ఫిల్మ్ పేరుతో ఉన్న ఆ వీడియోలో చాలామంది రోడ్డు పక్కన నిలబడి ఉంటారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గుతూ.. రోడ్డు మీద ఉన్న నీటిలో ఉమ్ముతాడు. అంతలో అటుగా ఒక బస్సు వేగంగా వస్తుంది. దాంతో రోడ్డు మీద ఉన్న నీళ్లన్ని వారందరిపై పడతాయి. ఈ విధంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపే ఈ వీడియో ఉన్నది 14 సెకన్లే అయినా చాలామందికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేలా ఉంది.

For More News..

కరోనా దెబ్బకు 5 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌మనీ సగానికి తగ్గింపు