ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కొలవులకు కటకటే

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కొలవులకు కటకటే

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఇప్పటికే 18 కోట్ల మంది జాబు లేనోళ్లు
ఈ ఏడాది మరో 25 లక్షలు జమైతరు
యూఎన్‌ ఐఎల్ రిపోర్టు

జాబు లేనోళ్ల నంబర్‌‌ ఈ ఏడాది ఇంకింత పెరుగుతదంట. 2020లో ప్రపంచవ్యాప్తంగా మరో 25 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడున్న 18 కోట్ల మందికి యాడ్‌‌ అవుతరంట. పైగా ఇప్పటికీ 50 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా సరిగా పని దొరుకుతలేదంట. కొందరికి తక్కువ టైం పని దొరుకుతుంటే, ఇంకొందరినేమో వాళ్ల స్కిల్స్‌‌కు తగ్గట్టు వాడుకుంటలేరంట. ఈ విషయాలన్నీ ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్‌‌ లేబర్‌‌ ఆర్గనైజేషన్‌‌ వెల్లడించింది. నిరుద్యోగానికి సంబంధించి ‘వరల్డ్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్‌‌ అండ్‌‌ సోషల్‌‌ ఔట్‌‌లుక్‌‌, ట్రెండ్స్‌‌ 2020) పేరుతో రిపోర్టును సోమవారం విడుదల చేసింది. గత తొమ్మిదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం స్థిరంగా ఉందని చెప్పిన సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా వేగం తగ్గుతున్న ఆర్థిక వృద్ధి దెబ్బ దేశాలకు గట్టిగానే తగులుతుందని హెచ్చరించింది. మాంద్యం వల్ల కొత్త జాబులు రావని, కొత్తగా పనిలోకి వచ్చే యువతకు కష్టాలు తప్పవని, నిరుద్యోగం పెరిగిపోతుందని చెప్పింది. ఇదే విషయాన్ని ఈ జనవరిలో యూఎన్‌‌ రిపోర్టొకటి చెప్పింది.

16 కోట్ల మందికి సగం సగం పనే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది నిరుద్యోగులున్నారని ఐఎల్‌‌వో వెల్లడించింది. 16.5 కోట్ల మందికి సగం సగం పనే దొరుకుతోందని చెప్పింది. 12 కోట్ల మంది ఉద్యోగం కోసం వెతకడం ఆపేశారని, వెతికినా దొరికుండకపోవచ్చని వివరించింది. మొత్తంగా 47 కోట్ల మంది జాబ్‌‌ కోసం తిప్పలు పడుతున్నారని చెప్పింది. ఇప్పటికే చాలా ఆఫ్రికా దేశాల్లో జనాల రియల్‌‌ ఇన్‌‌కమ్‌‌ తగ్గిందని, పేదరికం పెరిగిందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లోనూ నిరుద్యోగం ఎఫెక్ట్‌‌ ఈసారి కనబడుతుందని వివరించింది. వర్కింగ్‌‌ పావర్టీ (రోజు రూ.230 సంపాదించలేకపోవడం) ఎక్కువవుతోందని, ప్రపంచంలోని ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరిని ఇది పీడిస్తోందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల మంది దీని వల్ల బాధపడుతున్నారంది. ఉద్యోగాలివ్వడంలో ఇప్పటికీ ఆడ, మగ తేడా చూస్తున్నారని.. వయసు, ఉంటున్న ప్రాంతాన్నీ చూసి జాబులిస్తున్నారని చెప్పింది. 15 నుంచి 24 ఏళ్ల వయసున్న 26.7 కోట్ల మంది యూత్‌‌ అటు జాబు చేస్తలేరని, ఇటు చదువుకోవట్లేదని, పైగా ఏదైనా ట్రైనింగ్‌‌ తీస్కుంటున్నారా అంటే అదీ లేదని చెప్పింది.

ప్రొటెక్షనిజంతో తిప్పలు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రొటెక్షనిజం, ‌‌వ్యాపార పరిమితులు ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయని ఐఎల్‌‌వో చెప్పింది. చాలా దేశాల్లో జాబులు, జీతాలు, జాతీయాదాయం పడిపోతోందంది. మరోవైపు చాలా దేశాల్లో జనాలను వాళ్ల స్కిల్స్‌‌తో పోలిస్తే తక్కువ వాడుకుంటున్నారని, దీని వల్ల చాలా లాభాలు పొందలేకపోతున్నారని వివరించింది.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

కేంద్రం 166 కోట్లిస్తే.. రాష్ట్రం చిల్లిగవ్వ ఇవ్వలె

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది