ఫిబ్రవరి 3న ‘రైటర్ పద్మభూషణ్‘ రిలీజ్

ఫిబ్రవరి 3న ‘రైటర్ పద్మభూషణ్‘ రిలీజ్

‘కలర్‌‌‌‌‌‌‌‌ఫొటో’  చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ‘హిట్ 2’ లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్‌‌‌‌తోనూ ఆకట్టుకున్నాడు.  హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘రైటర్ పద్మభూషణ్’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో  స్ట్రగులింగ్ రైటర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు సుహాస్.

ఫిబ్రవరి 3న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ..కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా కాన్ఫిడెంట్‌‌‌‌గా కనిపిస్తున్నాడు సుహాస్. పోస్టర్‌‌‌‌‌‌‌‌ను బట్టి విజయవాడ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కథ ఉంటుందని అర్ధమవుతుంది. టీనా శిల్పరాజ్ హీరోయిన్‌‌‌‌. ఆశిష్ విద్యార్థి, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.