
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్.. ఓవల్ వేదికపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారత ఆటగాళ్లకు కనీస పోరాడే అవకాశం కూడా ఆసీస్ ఆటగాళ్లు 209 పరుగలు తేడాతో చిత్తుగా ఓడించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా అవతరించింది.
ఆస్ట్రేలియా జట్టు తొలిసారి 1987లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తరువాత 1999, 2003, 2007, 2015లో విశ్వవిజేతగా నిలిచింది. ఇక 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకోగా.. 2021లో టీ20 ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. ఇప్పుడు పాట్ కమ్మిన్స్ సారథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 గదను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా- ఐసీసీ ట్రోఫీలు
వన్డే వరల్డ్ కప్: 1987, 1999, 2003, 2007, 2015
ఛాంపియన్స్ ట్రోఫీ: 2006, 2009
టీ20 ప్రపంచ కప్: 2021
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్: 2021-23