ప్రత్యేక ఆకర్షణ: బతుకమ్మను ఎత్తుకున్న దుర్గమ్మ

ప్రత్యేక ఆకర్షణ: బతుకమ్మను ఎత్తుకున్న దుర్గమ్మ

యాదాద్రి: యాదగిరి గుట్టలోని హనుమాన్ వాడ బతుకమ్మ ఈ ఏడు ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో.. దుర్గాదేవి అమ్మవారు బతుకమ్మను ఎత్తుకున్నట్లు ఉంది. ఈ బతుకమ్మను యాదగిరి అనే వ్యక్తి తయారుచేశాడు. గత25 సంవత్సరాలనుంచి ప్రతీ ఏడాది ఒక్కోరకంగా బతుకమ్మను యాదగిరి తయారు చేస్తున్నాడు. ఈ బతుకమ్మను చూడడానికి జనాలు ఉత్సాహం చూపుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బతుకమ్మ పండుగను ఆనందొత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. పోయిరావమ్మా అంటూ పలుచోట్ల బతుకమ్మను నిమర్జనం చేస్తున్నారు.