యాదగిరిగుట్ట బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గపోరు

యాదగిరిగుట్ట బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గపోరు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు పీక్ స్టేజీకి చేరింది. నువ్వు ఎంతంటే నువ్వు ఎంతని ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్యంగా  స్థానిక బీఆర్ఎస్ నాయకులు దాడి చేసేందుకు ప్రయత్నించారు.  ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ పదవి దక్కించుకున్నబీఆర్ఎస్ పార్టీ మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ హామీతో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 

అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి పట్ల అసంతృప్తిగా బీఆర్ఎస్  నేతలు  స్థానిక ఎమ్మెల్యే ముందే మున్సిపల్ చైర్మన్ భర్తతో  వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి  కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కక్ష సాధింపులో భాగంగానే గొంగిడి మహేందర్ రెడ్డి అనుచరుడు కొండల్ రెడ్డే ఇవన్నీ చేస్తున్నాడని స్థానిక లీడర్లు ఆరోపిస్తున్నారు.