రవీంద్రభారతి, వెలుగు: కళాకృతి నృత్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు ఎం.భారతి మార్గదర్శకత్వంలో నిర్వహించిన 3వ యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్-2026 ఆదివారం రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియంలో ముగిసింది.
రిటైర్డ్ ఐఏఎస్ వి.ఎన్.విష్ణు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా.కళాకృష్ణ, అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ శంకర్ పాండీ, చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్(ఆర్ అండ్ డీ సౌత్) మీల యాగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కళా సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విష్ణు సూచించారు. కళాకృతి నృత్యాలయం శిష్యుల బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. యాదాద్రి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును షారోన్ లోవెన్, ప్రొఫెసర్ అరుణ భిక్షులకు అందజేశారు.
సుదర్శన్ రాయ్‌కు యాదాద్రి నేషనల్ అవార్డు, డాక్టర్కరుణ విజయేంద్రకు యాదాద్రి బెస్ట్ డ్యాన్స్ అకాడమీ అవార్డు, డా.వంశీ రామరాజుకు యాదాద్రి బెస్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ అండ్ ఆర్గనైజర్ అవార్డులను ప్రదానం చేశారు.
