యాదాద్రికి పది  వ్యవసాయ డ్రోన్లు

యాదాద్రికి పది  వ్యవసాయ డ్రోన్లు

యాదాద్రి, వెలుగు : పంటల సాగులో నానో యూరియా, ఇతర పురుగు మందులు చల్లడం కోసం డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాకు 10 డ్రోన్లు మంజూరు చేసింది. వీటిని 40 శాతం సబ్సిడీతో కో ఆపరేటీవ్​ సొసైటీలు, ఫార్మర్​ ప్రొడక్ట్​ ఆర్గనైజషన్ల(ఎఫ్​పీవో)కు అందించనుంది. దీంతో  తొలి విడతగా మూడు డ్రోన్లను తీసుకొని ఉపయోగించిన తర్వాతే ఆర్డర్​ వ్యవసాయ శాఖ మిగిలిన వాటికి ఆర్డర్​ ఇవ్వనుంది. ఇవ్వనున్నారు.

ఇందుకోసం అగ్రికల్చర్​ కమిషనరేట్​ 8 సంస్థలను సూచించింది. దీంతో ఇప్పటివరకూ డ్రోన్లు సరఫరా చేసే మూడు సంస్థల ప్రతినిధులతో డీఏవో వెంకట రమణారెడ్డి చర్చలు జరిపారు. తక్కువ మొత్తంలో బెస్ట్​ ప్రొడక్ట్​ ఎవరు ఇస్తే ఆ సంస్థను ఎంపిక చేస్తామని డీఏవో చెప్పారు.