- నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శనివారం నిర్వహించిన అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు పరిసమాప్తి పలికారు. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఉత్సవాలు11 రోజుల పాటు వైభవంగా సాగాయి. రాత్రి 9 గంటలకు స్వామివారికి శృంగార డోలోత్సవాన్ని అర్చకులు ఘనంగా జరిపారు.
టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 11 రోజుల పాటు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం నుంచి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం పూజలు పునరుద్ధరించనున్నారు
