మోత్కూరు (యాదాద్రి), వెలుగు : ఓ ఉద్యోగి జీతానికి సంబంధించిన టోకెన్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్న మోత్కూరు ఎస్టీవో ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ ఎండీ.ఖదీర్‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి 2024లో రావాల్సిన 38 రోజుల జీతం రూ. 1,09,384 రావాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం సదరు ఉద్యోగి గత నెల 26న మోత్కూరు ఎస్టీవో ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్‌ను కలువగా.. అతడు రూ. 10 వేలు డిమాండ్ చేశారు.
దీంతో ఖదీర్ అకౌంట్‌కు రూ. 5 వేలు, అతడి కొలిగ్ అయిన నిరంజన్ అకౌంట్‌కు మరో రూ. 5 వేలు ఫోన్‌పే చేయడంతో సదరు ఉద్యోగి జీతానికి సంబంధించి టోకెన్ జారీ చేశారు. అనంతరం ఆ ఉద్యోగి ఏసీబీ ఆఫీసర్లకు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఆఫీసర్లు ఫోన్‌పే ట్రాన్సాక్షన్లను పరిశీలించిన అనంతరం గురువారం ఖదీర్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో
హాజరుపరిచారు.
