V6 News

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్

ఏపీలో వైసీపీ శ్రేణుల అరెస్ట్ పరంపర మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తోంది. వైసీపీ మీడియా ప్రధాన కార్యాదర్శి శ్రీహరి, సోషల్ మీడియా నేత గిరీష్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. కుప్పం ఐటీడీపీ నేత వినోద్ ఫిర్యాదు మేరకు బుధవారం ( ఏప్రిల్ 15 ) విజయవాడలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీహరి ల్యాప్ టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీహరిని విజయవాడ నుంచి కుప్పం తరలించినట్లు సమాచారం.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం పంపనూరు కు చెందిన వైసీపీ సోషల్ మీడియా నేత గిరీష్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురంలో గిరీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. పార్టీ ఎక్స్ అకౌంట్ లో పెట్టిన ఓ పోస్టుపై.. చిత్తూరు జిల్లాలో కంప్లయింట్ చేశారు టీడీపీ కార్యకర్త వినోద్ మూర్తి. ఈ కంప్లయింట్ ఆధారంగా ఇవాళ ఉదయం తాడేపల్లిలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

శ్రీహరి అరెస్టుపై పార్టీ నేతలు స్పందించారు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు బాద్యుడిని చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని.. వైసీపీ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.