సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి వైదొలగనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తానని యడ్డీ తెలిపారు. సీఎంగా యడియూరప్ప ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుక సభలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండేళ్లు అగ్ని పరీక్షగా గడిచాయన్నారు. 78 ఏళ్ల యడ్డీకి వయస్సే ప్రధాన అవరోధంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.