శంకరపట్నం, వెలుగు: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన బొజ్జ మహేందర్(34) కొన్నేండ్లుగా తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆఫీస్ సబార్డినేట్(అటెండర్)గా పనిచేస్తున్నాడు. తనకు వివాహం జరగడం లేదని కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం కరీంపేటలో రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. స్థానికులు 108 వాహనంలో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
