- నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అద్వైత్
- నాలుగేండ్లకే చెస్ ట్రైనర్‌గా సిటీ బుడ్డోడి రికార్డు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా సిటీకి చెందిన నాలుగేండ్ల బుడతడు అద్వైత్ రెడ్డి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 4 ఏండ్ల 6 నెలల వయసున్న అద్వైత్ బేసిక్ కోర్సులో 51 మందికి ట్రెయినింగ్ ఇవ్వడంతో పాటు నిర్విరామంగా 30 పజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. నార్సింగ్‌కు చెందిన అద్వైత్ తండ్రి సందేశ్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, తల్లి హిరన్మై గృహిణి. సీజార్ చెస్ అకాడమీలో చెస్ ఓనమాలు నేర్చుకున్న అద్వైత్ ఓక్రిడ్జ్ స్కూల్లో చుదువుతున్నాడు. పలు చెస్ టోర్నీల్లోనూ పోటీ పడుతున్నాడు
