న్యూఢిల్లీ: మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు నేరుగా శాటిలైట్లకు కనెక్ట్ అయ్యేలా డైరెక్ట్ టు డివైస్ (డీటూడీ) టెక్నాలజీని తీసుకురావడానికి కేంద్రం చర్చలు జరుపుతోంది. కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు, సరిహద్దు జిల్లాల్లో నెట్‌వర్క్ సమస్యలను అధిగమించడానికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయి.
అత్యవసర సమయాల్లో ప్రజలు సహాయం కోసం పిలవడానికి, లొకేషన్‌ను షేర్ చేయడానికి, సమాచారాన్ని అందించడానికి ఇది సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ భారతదేశ నిబంధనల ప్రకారం ఎలా పనిచేస్తుందనే దానిపై యాపిల్, గూగుల్ సంస్థలు టెలికమ్యూనికేషన్ల శాఖ స్పష్టత కోరాయి.
శాటిలైట్ కనెక్టివిటీ వల్ల బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుందని, ఫోన్లలో చిన్న యాంటెన్నాలకు పరిమితులు ఉంటాయని ఇవి పేర్కొన్నాయి.
