ఉప్పల్, వెలుగు: దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి ప్రధాని మోదీ అమెరికాతో రాజీ పడుతున్నారంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షుడు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.
మ్యాచ్లో దొంగల చేతివాటం
ఆదివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూస్తుండగా నారాయణపేటకు చెందిన లింగా రెడ్డి ఫోన్ను దొంగలు కొట్టేయగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్కతాకు చెందిన బాబర్, సద్దాం హుస్సేన్ణు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
