ట్యాంక్ బండ్, వెలుగు: పార్లమెంట్లో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి,రోషిని జైస్వాల్ మాట్లాడుతూ.. అమెరికా, చైనా దేశాలతో జరిగిన ఒప్పందాలను బయటకు తెలియజేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తే ఆయనను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు ఈ కుట్రలను అన్ని గమనిస్తున్నారని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు.
