జీడిమెట్ల, వెలుగు: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాహిత్, వికాస్, సుమంత్ అనే యువకులు గంజాయి తాగుతున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు.
