క్రికెట్ ఆడొద్దన్న మహిళ పై యువకుల దాడి..జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో ఘటన

క్రికెట్ ఆడొద్దన్న మహిళ పై యువకుల దాడి..జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: ఇంటి సమీపంలో క్రికెట్ ఆడవద్దని చెప్పిన మహిళపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఫిలింనగర్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన ముద్దునూరు మంజుల(42) ఇంటి సమీపంలో కొంతమంది యువకులు తరచూ క్రికెట్ ఆడుతున్నారు. 

గతంలో క్రికెట్ బంతి తగిలి తన కంటికి గాయమైన ఘటనను గుర్తుచేస్తూ, ఆ ప్రాంతంలో క్రికెట్ ఆడవద్దని మంజుల యువకులను కోరింది. ఈ విషయంలో జానీ అనే యువకుడితో వాగ్వాదం జరిగి చెంపదెబ్బ కొట్టింది. జానీ తన సోదరులు, అనుచరులతో కలిసి మంజుల ఇంటికి వెళ్లి ఆమెపై, ఆమె కొడుకుపై దాడి చేశారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఫిలింనగర్ పోలీసులు తెలిపారు.