ఆటో నడిపి అందరిని ఆకట్టుకున్న షర్మిల

ఆటో నడిపి అందరిని ఆకట్టుకున్న షర్మిల

డ్రైవ‌ర‌న్నల  క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కే రోజు తొంద‌ర్లోనే ఉందని తెలిపారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.  గురువారం ఆమె ఖమ్మంలో పర్యటించారు.  కార్మికుల సంక్షేమానికీ  ప్రాధాన్యత ఇవ్వడ‌మే YSR తెలంగాణ పార్టీ ధ్యేయం అన్నారు.  షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది.  ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర జరిగిన భారీ బహిరంగ సభకు వెళ్లేముందు షర్మిల ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.  ఖమ్మం పట్టణంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా షర్మిల ఓ అభిమాని కోరిక మేరకు ఆటో నడిపారు. ముస్తాఫా నగర్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను షర్మిల ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డ్రైవ‌ర‌న్నల క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కే రోజు తొంద‌ర్లోనే ఉంది. కర్షకుల‌తో పాటు కార్మికుల సంక్షేమానికీ స‌మ ప్రాధాన్యత ఇవ్వడ‌మే YSR తెలంగాణ పార్టీ ధ్యేయం అని ట్వీట్ చేశారు.   ఆటోడ్రైవర్ వేషధారణలో షర్మిల ఆటో నడపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన షర్మిల ఇప్పుడు ఆటోవాలాలను ఆకట్టుకున్నారు.